ముఖ్యమంత్రి యువనేస్తం’వెబ్‌సైట్ ప్రారంభం

Chief Minister's youth is the beginning of the website

Chief Minister's youth is the beginning of the website

Date:15/09/2018
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో ‘ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌’ ప్రారంభమయ్యింది. ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దీనికి శ్రీకారం చుట్టారు. వెబ్‌సైట్‌లో ఆధార్‌ కార్డు నంబర్‌ నమోదు చేయగానే అర్హత ఉందో లేదో సమాచారం తెలుస్తుంది. 22-35 ఏళ్ల మధ్య వయసు ఉండి.. పీజీ లేదా డిగ్రీ, డిప్లొమా చదివి ఏడాది పూర్తై.. తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’కు అర్హులు.
ఈ పథకం ద్వారా అక్టోబరు 2నుంచి లబ్దిదారులకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి అందజేయనున్నారు. యువనేస్తంతో ఏడాదికి రూ.1200 కోట్లు ఖర్చు అవుతుందని.. రాష్ట్రంలో సుమారు 12లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.‘ముఖ్యమంత్రి యువనేస్తం’తో సరికొత్త చరిత్ర సృష్టించ బోతున్నామన్నారు చంద్రబాబు. దేశంలోనే ఓ చారిత్రక పథకమని వ్యాఖ్యానించిన సీఎం.. ఎంతో అధ్యయనం, కసరత్తు చేసి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. నిరుద్యోగ భృతి చెల్లించడమొక్కటే యువనేస్తం లక్ష్యం కాదని.. ఈ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేవరకు కృషి చేస్తామన్నారు. అదే ప్రభుత్వం అసలు లక్ష్యమని.. మంచి శిక్షణతో పాటు ఆర్ధిక తోడ్పాటునిచ్చి యువత అభివృద్ధికి యువనేస్తం ద్వారా పాటుపడతామన్నారు.
Tags:Chief Minister’s youth is the beginning of the website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *