సీఎం చంద్రబాబుకు  ఏపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి లేఖలు

Date:15/03/2018
విజయవాడ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీసీసీ ఛీఫ్ రుఘువీరా రెడ్డి గురువారం నాడు ఐదు ఉత్తరాలు రాసారు. .   విభజన నేపథ్యంలో అన్యాయానికి గురై ఇబ్బందులు పడుతున్న “తెలంగాణ స్థానికేతర ఉపాధ్యాయుల  సమస్యలు పరిష్కారించాలని కోరారు. విభజన అనంతరం సహజంగానే తలెత్తే కొన్ని సమస్యలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, విజ్ఞతతో ఎలా పరిష్కరించుకోవాలో,అలా కుదరని పక్షంలో కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఎలా సరిచేసుకోవాలో ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉంది.కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమమైన, సానుకూలమైన ధోరణితో వ్యవహరించక పోవటం,మరో వైపు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవటం వల్ల కోతిపుండు బ్రహ్మరాక్షసి ఐన చందంగా అనేక సమస్యలు వికృత రూపం దాల్చాయి. అలాంటి సమస్యల్లో ఇది ఒకటి. కానీ ఇది చాలా చిన్న విషయం. ఏలిన వారు కాస్త దృష్టి సారిస్తే తేలిగ్గానే పరిష్కారమయ్యె సమస్య. పరిష్కారించాలని కోరారు.  2018 సంవత్సరంలో డీఎస్సీ పిఈటి పోస్టుల పెంపుదల కోరుతూ లేఖలు రాసారు. శారీరక,మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామానికి ఉన్న ప్రాధాన్యత మీకు తెలియనిది కాదు. మీరు అనేక సందర్భాలలో మీ ఆరోగ్యానికి, ఉల్లాసానికి కారణం మీరు చేసే వ్యాయామమే అని చెప్పి ఉన్నారు. అలాగే పలువురు యోగా గురువులను నెత్తిన పెట్టుకొని పూజించటం,వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.    రజక వృత్తిదారులకు సామాజిక భద్రత కల్పించాలని,  వారి సంక్షేమానికి రజక ఫెడరేషన్ కు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని మూడో లేఖలో కోరారు.  సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ పని చేస్తున్న కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్,పార్ట్ టైం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చెయ్యాలని కోరుతూ  ఒక లేఖ రాసారు.  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు  జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
Tags: Chief Raghuvir Reddy’s letter to CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *