అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
తిరుచానూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్ద డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు డాక్టర్ జవహర్ రెడ్డికి శేషవస్త్రం అందించి ఆశీర్వదించారు. డిప్యూటీ ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ బాలాజి, ఆర్డీవో కనక నరసా రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంట ఉన్నారు.
Tags; Chief Secretary to the State Government in the service of Ammavari

