పుట్టపర్తిలో  చీఫ్ విప్ మార్నింగ్ వాక్

Chief whip Morning Walk in Puttaparthi

Chief whip Morning Walk in Puttaparthi

Date:19/02/2018
పుట్టపర్తి ముచ్చట్లు:
గుడ్ మార్నింగ్ పుట్టపర్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం ఉదయం పుట్టపర్తి 13 వార్డు లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువ, ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయాలని కాలనీ వాసులు ప్రభుత్వ చీఫ్ విప్ ను కోరారు. మున్సిపాలిటీలో ప్రజల సమస్యలపై  తక్షణం పరిస్కారం చూపాలని చీఫ్ విప్ అధికారులకు ఆదేశించారు. ఏపీ అభివృద్ధి కి పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మద్దతు ఇవ్వాలని చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు. ప్రతి నెల రూ.1000 ల పింఛన్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు మా ఇంటి పెద్ద కొడుకు గా చిన్న కొడుకు పల్లె రఘునాథ్ రెడ్డి అని పలువురు వృద్దులు పేర్కొవడం పై ఎమ్మెల్యే పల్లె ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బెస్త చలపతి, పుడా ఛైర్మన్ కడియాల సుధాకర్, కౌన్సిలర్లు దిల్షాద్ రఫీ, లక్ష్మీదేవి, వెంకటరమణమ్మ , కళావతి ,చెన్న కృష్ణమ్మ ,టీడీపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags: Chief whip Morning Walk in Puttaparthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *