నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో చిన్నారి అప‌హ‌ర‌ణ‌కు.. పోలీసులు అదుపులోకి మ‌హిళ‌

హైద‌రాబాద్  ముచ్చట్లు:
 
న‌గ‌రంలోని నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో 18 నెల‌ల చిన్నారి అప‌హ‌ర‌ణ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఆ పాప ఆచూకీని మెహిదీప‌ట్నంలోని కౌమ‌టికుంట‌లో పోలీసులు గుర్తించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మ‌హిళ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాప‌ను త‌ల్లిదండ్రుల‌కు పోలీసుల‌కు అప్ప‌గించారు. నిన్న‌ హాస్పిట‌ల్‌లోకి ప్ర‌వేశించిన ఓ మ‌హిళ చిన్నారిని అప‌హ‌రించిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో ఆమె ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశారు. అయితే మ‌హిళ చిన్నారిని అప‌హ‌రించిన అనంత‌రం.. మెహిదీప‌ట్నం చేరుకున్న‌ట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అక్క‌డ్నుంచి హైద‌ర్ష్ కోటేలోని క‌ల్లు కంపౌండ్‌లో క‌ల్లు సేవించిన‌ట్లు నిర్ధారించారు. ఈ స‌మ‌యంలో కూడా ఆమెతో చిన్నారి ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. క‌ల్లు కంపౌండ్ నుంచి అత్తాపూర్‌లోని కోమ‌టికుంట‌ చేరినట్లుగా పోలీసులు గుర్తించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
 
Tags: Child abducted at Nilofar Hospital, police arrest woman

Leave A Reply

Your email address will not be published.