కాలువలో పడి చిన్నారి మృతి

Date:12/11/2019

నెల్లూరు ముచ్చట్లు:

కార్తీక పౌర్ణమి సందర్భంగా  దీపాలు వెలిగించను పోయి ఓ చిన్నారి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృత్యువాత పడిన సంఘటన నెల్లూరు జిల్లా  సంగం మండలం వంగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగం మండలం వంగల్లు గ్రామానికి చెందిన తిరుపతమ్మ  తన కుమార్తె దేవసేనమ్మ(10) కొంత మంది మహిళల తో కలిసి  కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించేందుకు గ్రామ సమీపంలో ఉన్న కనిగిరి రిసర్వాయర్ ప్రధాన కాలువ వద్ద కు వచ్చి వేకువ జామున  దీపాలు వెలిగిస్తున్నారు.ఈ క్రమంలో తన కుమార్తె దీపాలు వెలిగిస్తుందని అనుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో జారిపడింది. చీకటి కావడంతో వెతికి బయటకి తీసే లోపు చిన్నారి మృతి చెందింది.. కుటుంబ క్షేమం కోసం పండగ రోజు దీపాలు వెలిగించేందుకు వచ్చి చిన్నారి మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన స్థానిక గ్రామ ప్రజలకు కూడా కంటతడి పెట్టింది.

 

స్మార్ట్ సిటీగా ‘అనంత’

 

Tags:Child dies in canal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *