చిన్నారి మృతి…ఆసుపత్రి సిబ్బందిపై బంధువుల దాడి

మైలవరం  ముచ్చట్లు:
స్థానిక మహదేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యం అంటూ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబికులు సిబ్బందిపై తిరగడ్డారు. మైలవరం మండలం లోని మొర్సుమల్లి తండాకు చెందిన ఇద్దరు చిన్నారులకు తేలు కుట్టడంతో వారిని  స్థానిక  మహాదేవ్  ఆసుపత్రికి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వారి తల్లిదండ్రులు తీసుకు వచ్చారు. అందులో ఒక చిన్నారి పరిస్థితి మెరుగు పడగా ,  బంకాడోతూ లక్కీ (5) అనే చిన్న బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చాలా సేపటివరకు తమకు చెప్పలేదంటూ  బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు, బంధువుల ఆవేశం కట్టలు తెంచుకుని  సిబ్బంది పై   తిరగబడ్డారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Child killed… Relatives attack hospital staff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *