పుంగనూరులో బాలకార్మికులను పనులకు వినియోగించరాదు- న్యాయమూర్తి కార్తీక్‌

పుంగనూరు ముచ్చట్లు:

చిన్నపిల్లలను కార్మికులుగా పనులలో వినియోగించుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని నక్కబండలో ప్రపంచ బాలకార్మిక నిషేధిత దినోత్సవాన్ని ఎంఈవో కేశవరెడ్డి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ తో కలసి నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలను పనులలో వినియోగించుకోవడం పూర్తిగా నిషేధించడమైందన్నారు. అలాగే 14 నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలను ప్రాణాలకు ముప్పువాటిళ్లని పనులకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా రాజ్యాంగం ప్రసాధించిన విద్యాహక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఈ విషయమై పేద తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, పిల్లలను బడికి పంపించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. బాలకార్మికులు ఉంటే తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్ద ఖాదర్‌బాషా, పోలీసులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Child labor should not be used for work in Punganur – Judge Karthik

Post Midle
Natyam ad