బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి

– మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ ముచ్చట్లు:


గ్రామాలలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల బలోపేతం చేసినట్లైతే  బాలల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడవచ్చునని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు, సోమవారం రోజున రాష్ట్రంలోని 33 జిల్లాల సంక్షేమ అధికారులు, బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ లు బాలల పరిరక్షణ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేసారు, స్పెషల్ సెక్రెటరీ మరియు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుచూ రాష్ట్రంలో అన్ని జిల్లా మండల పట్టణ  గ్రామ స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసామని అయితే కరోనా కాలంలో కమిటీలను బలోపేతం చేసే క్రమంలో కొంత జాప్యం జరిగిందని కాబట్టి కమిటీలను బలోపేతం చేయుటకు  సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి తద్వారా రానున్న మూడు నెలల్లో అన్ని స్థాయిల కమిటీలను బలోపేతం చేయుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు,

 

Post Midle

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు తో పిల్లలపై వేధింపులు,అత్యాచారాలను అరికట్టుటకు, బాల్య వివాహాల నిర్మూలనకు,అక్రమ దత్తత  ఆరికట్టుటకు, బాల కార్మికులు లేని గ్రామంగా తీర్చి దిద్దుటకు మరియు రక్షణ సంరక్షణ అవసరమున్న పిల్లలను గుర్తించి తగు పునరావాసం కల్పించుటకు దోహదపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల సహకారంతో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామాలుగా రెండు గ్రామాలను ఎంపిక చేసామని త్వరలో జిల్లా స్థాయిలో అధికార పూర్వకంగా ప్రకటించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు,

 

 

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ గ్రామ బాలల పరిరక్షణ కమిటీ  సహకారంతో ప్రతి ఉదయం సాయంత్రం బాల్య వివాహాల నిలుపుదల కోసం చట్టాన్ని అతిక్రమించి జరుగబోయే పరిణామాల గురించి దండోరా వేయించి అవగాహన కల్పిస్తున్నామని బాల్య వివాహాల నిలుపుదల కోసం ఐదు ఇంజెక్షన్ ఆర్డర్ లు కూడా తీసుకొని తగు చర్యలు తీసుకున్నామని అన్నారు.సమావేశం అనంతరం ప్లాన్ ఇండియా సహకారంతో రూపొందించిన బాలల పరిరక్షణ కమిటీ కరదీపిక ను మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కే దామోదర్, డాక్టర్ పరికి సుధాకర్, పి హైమావతి, బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ కే శిరీష,  జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎం మౌనిక, సోషల్ వర్కర్ జీ సునీత, ఓఆర్డబ్ల్యూ పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Child protection committees need to be strengthened

Post Midle
Natyam ad