Natyam ad

చిన్నారిపై లైంగిక వేధింపులు

కృష్ణా జిల్లా ముచ్చట్లు:

బంటుమిల్లి మండలం  నెహ్రూనగర్లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి.చిన్నారిపై లైంగిక వేధింపులు.దేహశుద్ధి అనంతరం అరెస్ట్ఉపాధ్యాయుడు రామానంద సాగర్ – కాదు కాదు – కామానంద సాగర్ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న ఏడు సంవత్సరాల మైనర్ బాలికపై ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు బి.రామానంద సాగర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది.బాలిక పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించగా.విషయం గమనించిన బాలిక తల్లిదండ్రులు ఏం జరిగిందని పలుమార్లు ప్రశ్నించినా చెప్పలేదు.స్కూల్కు వెళ్లనని భయపడుతున్న బాలికను తల్లి మందలించడంతో జరిగిన విషయం.. ఆ చిన్నారి తన తల్లికి చెప్పింది.వెంటనే తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.అరెస్టు చేసిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

 

Post Midle

Tags: Child sexual abuse

Post Midle