Natyam ad

108 లో ప్రసవం -తల్లి, బిడ్డ క్షేమం  

వేములవాడ  ముచ్చట్లు:

పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 లో రుద్రంగి నుండి చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి   తరలిస్తుండగా  అంబులెన్స్ లో ప్రసవించిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది.. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎస్. రజిత  పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 కు సమాచారం అందించారు . దీంతో హుటాహుటిన రుద్రంగి చేరుకున్న 108 సిబ్బంది పురిటి నొప్పులతో బాధపడుతున్న రజితను చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చే క్రమంలో మార్గమధ్యలో  పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి ,దీంతో అంబులెన్స్ పక్కన పెట్టి ఆమెకు సుఖ ప్రసవం  చేశారు 108 సిబ్బంది.. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108  ఫైలెట్ వనపర్తి అనిల్, ఆశా వర్కర్ సుజాత తెలిపారు… అనంతరం తల్లి బిడ్డను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Tags: Childbirth in 108 – Mother and child are healthy

Post Midle

Leave A Reply

Your email address will not be published.