తల్లి మృత్తితో అనాధులైన చిన్నారులు

అమరావతి ముచ్చట్లు:

తల్లి మృత్తితో అనాధులైన చిన్నారులు ఘటనపై స్పందించిన మహిళా కమిషన్  చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి.అనాధులైన చిన్నారులను స్కూల్ లో జాయిన్ చేయడం  అదే విధంగా చిన్నారుల బాగోగులు, వసతి  ఏర్పాట్లు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ  జిల్లా అధికారులను ఆదేశించిన గజ్జల వెంకటలక్ష్మి చైర్పర్సన్ మహిళా కమిషన్.

 

వివరాలు  –

అనంతపురం జిల్లా శేట్టూరు గ్రామానికి చెందిన  చంద్రకళ అనే మహిళ  నిన్నటిదినం గుండెపోటుతో మరణించింది. ఆమెకి ముగ్గురు పిల్లలు .వారి భర్త జి తిమ్మరాజు, పెద్ద పాప పేరు జి. ప్రభాని వయసు 10 సంవత్సరములు రెండవ పాప పేరు  అనుశ్రీ వయసు 6 సంవత్సరములు బాబు వయసు 6 నెలలు ప్రస్తుతము ఈ పిల్లలు వారి మేనత్తయినటువంటి గౌరమ్మ దగ్గర ఉన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆదేశాలతో అనంతపురం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్  స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆ పిల్లలను శిశు గృహ కు తరలించటం జరిగింది.నిన్నటి దినము తన భార్య చనిపోతే భర్త  తిమ్మరాజు చూడడానికి కూడా రాలేదు.అప్పులు ఎక్కువయి బెంగుళూరు కి వెళ్లడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.

 

Tags: Children orphaned by the death of their mother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *