Children under the age of 14 should not be used for work

14 ఏళ్ల లోపు పిల్లలను పనులకు వినియోగించరాదు

– సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌

Date:20/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పదునాలుగేళ్లలోపు గల పిల్లలను ఎలాంటి పనులకు వినియోగించరాదని , అలా చేస్తే చట్టరీత్య శిక్షార్హులని పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ హెచ్చరించారు. మంగళవారం న్యాయవాదుల సంఘ కార్యాలయంలో అవగాహన సదసు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మండల్‌ లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ద్వారా మెగా వర్చువల్‌ లోక్‌అదాలత్‌ను నవంబర్‌ 7న నిర్వహిస్తామన్నారు. అలాగే భారతరాజ్యాంగం ప్రసాధించిన మేరకు సమాజంలో అనేక జాతులు, మతాల వారు జీవిస్తున్నారని , అలాంటి వారి హక్కులకు భంగం కలిగితే సమస్యలు తీవ్రమౌతుందన్నారు. అలాంటి చర్యలు ద్వారా ప్రజలు ఉనికి కోల్పోతారన్నారు. వీటిని కాపాడేందుకు తగిన చట్టాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. అలాగే మైనర్‌ పిల్లలను ప్రతి ఒక్కరిని చదివించాలని, ఈ మేరకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మైనర్‌లపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సమాజంలో ప్రతి ఒక్కరు కలసిమెలసి, శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టెక్నికల్‌ ఏవోగా దీప

Tags: Children under the age of 14 should not be used for work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *