ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి-జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
జిల్లాను పోలియో ఫ్రీ గా మార్చాలి
కరీంనగర్ ముచ్చట్లు:
జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్
పోలియో కార్యక్రమం పై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ ఆదివారం రోజున నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని తెలిపారు. 0-5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా
వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండు, రైల్వే స్టేషన్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి చిన్నారులందరికి పోలియో చుక్కలు
వేయాలని తెలిపారు. జిల్లాను పోలియో ఫ్రీ గా మార్చేందుకు అందరు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ నెల 27వ తేదీన పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు మరుసటి రోజు నుంచి ఆరోగ్య
కార్యకర్తలు ఇంటింటికి తిరిగి గుర్తించిన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్
జువేరియా, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ రత్నమాల, వివిధ శాఖల అధికారులు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:Children under the age of five should be vaccinated against polio – District Collector RV Karnan