Natyam ad

పుంగనూరులో ఘనంగా బాలల దినోత్సవం

పుంగనూరు ముచ్చట్లు:

భారత తొలి ప్రధాన మంత్రి దివంగత జవహార్‌లాల్‌నెహ్రూ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌, గూడూరుపల్లె హైస్కూల్‌లో హెచ్‌ఎంలు సుబ్రమణ్యం, మహేష్‌నారాయణతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంబరాలు చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్దీన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు కాంతమ్మ, అమ్ము, సాజిదా, మేలుపట్లలో తేజ తదితరులు వేడుకల్లో పాల్గొని నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందిన చిన్నారులకు బహుమతులు పంపిణీ చేశారు. అలాగే బాలబాలికలు నెహ్రు వేషధారణలు ధరించి పలువురిని ఆకట్టుకున్నారు. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Children’s Day is celebrated in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.