పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పలు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించినట్లు కరాటే మాస్టర్ మన్సూర్‌బాషా ఆదివారం తెలిపారు. శనివారం ఒంగోలులో సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్‌స్టేట్ పోటీలలో పట్టణానికి చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొని 8 మంది విద్యార్థులు బంగారు, రజిత , సిల్వర్ మెడల్స్ సాధించారు. వీరికి కరాటే అసోసియేషన్ ప్రతినిదులు భరత్‌శర్మ, హెచ్‌ఎంఎల్‌శాలు మెడల్స్ అందజేసి అభినందించారు. మెడల్స్ సాధించిన వారిలో ముస్టాక్, మహేష్, సాయియోగేంద్ర, ఫరుఖాన్, ముస్తఫా, అనీష్, ఆదిల్, షానూర్ లు మెడల్స్ సాధించారు. వీరికి మాస్టర్లు ఉమర్, ఫరుక్, శిక్షణ ఇచ్చారు. విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
Tags:Children’s talent in karate