లాభాల పండిస్తున్న మిర్చి

అనంతపురం ముచ్చట్లు:

ఎండు మిర్చి సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. మడకశిర నియోజకవర్గంలో అధిక శాతం మంది రైతులు ఎండు మిర్చి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఏడాది వేరుశనగ సాగుతో నష్టాలు మూటకట్టుకుంటున్న రైతులు ఎలాగైనా సరే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మిర్చి సాగువైపు దృష్టిసారించారు. ప్రసుత్తం ఎండు మిరపకు మార్కెట్‌లో మంచి« ధర ఉండటంతో బోరుబావుల కింద ఎక్కువ మంది మిరప సాగు చేస్తున్నారు.  మడకశిర, అగళి, అమరాపురం, గుడిబండ, రొళ్ల మండలాల్లో ఇప్పటికే 910 ఎకరాలకుపైగా సాగు చేసిన మిరప పంట ఆశాజనకంగా ఉంది. ఎక్కువ మంది రైతులు మిరప సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మిరప పైరు ఒక్కోటి రూ.75 పైసాలు కాగా ఎకరా పంట సాగుకు మిరప పైరుకు రూ.12 వేలు ఖర్చు అవుతోంది.  కృషాజలాలకు తోడు భారీ వర్షాలు కురవడంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. బోరు బావుల్లోనూ నీటి మట్టం పెరగడంతో మిరప పంట సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎకరా పంట సాగుకు మిరప పైరు, మందులు, ఎరువులకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. మార్కెట్‌లో ప్రసుత్తం 10 కిలోల ఎండు మిరప రూ.2,500 వరకు ధర పలుకుతోంది. తెగుళ్లు సోకకపోతే ఎకరాకు రూ.లక్ష దాకా ఆదాయం ఉంటుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిరప పంటకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా వర్తింపజేయడంతో అధిక శాతం మంది రైతులు మిర్చి సాగుపై మరింతగా ఉత్సహం చూపుతున్నారు. వర్షాలకు పంట దెబ్బతింటే ఎకరా మిరప పంటకు రూ.60 వేల చొప్పున బీమా వర్తిస్తోంది.

 

Tags: Chili that reaps profits

Leave A Reply

Your email address will not be published.