మీ ముత్తాత’ వల్లే చైనాకు ఆ అధికారం

China-because-your-great-grandfather

China-because-your-great-grandfather

   Date:14/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడం దేశంలో రాజకీయ వివాదాలకు తెర లేపింది. మసూద్‌ అంశంపై చైనా అధ్యక్షుడిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు భాజపా దీటుగా బదులిచ్చింది. ‘చైనాకు ఆ అధికారం మీ ముత్తాత’ వల్లే వచ్చిందిగా అంటూ కౌంటర్‌ ఇచ్చింది.‘భారత్‌ను పక్కనబెట్టి మీ ముత్తాత చైనాకు అధికారాన్ని బహుమతి ఇవ్వకుంటే ఇప్పుడు ఐరాస భద్రతామండలిలో ఆ దేశం ఉండేది కాదు. మీ కుటుంబం చేసిన తప్పులను ఇప్పుడు భారత్‌ సరిదిద్దుకుంటూ వస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే ఈ పోరాటంలోనూ భారత్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని మేం హామీ ఇస్తున్నాం. ఈ విషయాన్ని ప్రధాని మోదీకి వదిలేసి చైనా దౌత్యవేత్తలతో మీరు రహస్యంగా మంతనాలు జరపండి’’ అని భాజపా తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది.
Tags:China-because-your-great-grandfather

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *