గల్వాన్ లోయ లో చైనా

Date:22/02/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

గతేడాది గల్వాన్ లోయ వద్ద భారత్ సైన్యంతో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను ఇటీవల చైనా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండగా… గల్వాన్ ఘర్షణకు సంబంధించి వీడియోను ఎనిమిది నెలల తర్వాత విడుదల చేసింది. ఘటన జరిగిన ఎనిమిది నెలల తర్వాత వీడియోను విడుదల చేయడం, మృతుల సంఖ్యపై ప్రశ్నించినందుకు ముగ్గురు జర్నలిస్ట్‌లను చైనా అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేగుతోంది. వీరిలో ఒకరు పరిశోధనాత్మక వార్తలు రాసే జర్నలిస్ట్ కియూ జిమింగ్ (38) కాగా.. నంజింగ్‌లో అతడిని అరెస్ట్ చేశారు.గల్వాన్ లోయ ఘర్షణలో చనిపోయిన నలుగురు సైనికులు, గాయపడిన ఓ అధికారికి అవార్డులను ప్రదానం చేసినట్టు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శుక్రవారం ప్రకటించింది. గల్వాన్ ఘర్షణలో మృతుల సంఖ్యపై చైనా ప్రభుత్వాన్ని జర్నలిస్ట్ కియూ ప్రశ్నించాడు. భారత సైనికులతో జరిగిన దాడిలో 45 మంది చైనా జవాన్లు చనిపోయినట్టు అక్కడ అధికారులు పేర్కొన్నారంటూ ఇటీవల ఉత్తర కమాండర్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలను తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.మృతుల సంఖ్యపై సందేహాలు వ్యక్తం చేసిన జిమింగ్.. ఘటన జరిగిన వెంటనే భారత్ ప్రకటిస్తే, ఎనిమిది నెలల సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించాడు. ఇదే కారణంతో మరో జర్నలిస్ట్‌ను కూడా చైనా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. గల్వాన్ లోయలో అమరులైన సైనికులను అవమానించేలా పోస్ట్ చేశారని అతడిపై ఆరోపణలు చేసినట్టు సమాచారం. ఇక, సీపీఎల్ఏ సైనికులను కించపరిచేలా పోస్ట్‌లు చేశాడనే ఆరోపణలతో వారం రోజుల కిందట సించుయాన్‌లో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; China in the Galvan Valley

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *