China is ready to build a huge project

భారీ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా రెడీ

Date:30/11/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు

టిబెట్ మీదుగా భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమయ్యింది. హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అధికారిక మీడియా వెల్లడించింది. 14వ పంచవర్ష ప్రణాళిక (2021-25)లో భాగంగా వచ్చే ఏడాది నుంచే అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు సమీపంలో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపింది. యార్లుంగ్‌ జాంగ్బో (బ్రహ్మపుత్రకు టిబెటన్‌ పేరు) దిగువ ప్రాంతంలోనే నిర్మాణం ప్రారంభించనున్నట్టు ‘పవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా’ సంస్థ ఛైర్మన్‌ యన్‌ జియాంగ్‌ గురువారమే ప్రకటించినట్టు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది.అమెరికాను వెనక్కునెట్టి ప్రపంచశక్తిగా అవతరించాలని ఊవిళ్లూరుతోన్న చైనా.. తన 14వ పంచవర్ష ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సంగతి తెలిసిందే. యన్ మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ 14 వ పంచవర్ష ప్రణాళికలో దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుందని తెలిపారు. వీటిని 2035 నాటికి వీటిని చేరుకోవాలని భావిస్తోందని అన్నారు. చరిత్ర సమాంతరంగా లేదు…చైనా జల విద్యుత్ పరిశ్రమకు చారిత్రాత్మక అవకాశంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.

 

గత నెలలో జరిగిన సీపీసీ ప్లీనరీ సమావేశంలో 14 వ పంచవర్ష ప్రణాళిక (2021-2025), జాతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధి, 2035 దీర్ఘ-శ్రేణి లక్ష్యాలపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) అధికారికంగా ఆమోదించిన తరువాత ఈ ప్రణాళిక వివరాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టు ప్రతిపాదనలు భారత్, బంగ్లాదేశ్‌లో ఆందోళనలను రేకెత్తించాయి. భారత్, బంగ్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని గతంలో చైనా సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. బ్రహ్మపుత్ర నదీ జలాలను మనకు దక్కకుండా ‘జుర్రేయడానికి’ చైనా పదేళ్లుగా కుట్రను కొనసాగిస్తోంది. దశాబ్దికిపైగా చైనా ‘కమ్యూనిస్టు’ ప్రభుత్వం కొనసాగిస్తున్న జల చౌర్యాన్ని భారత్ చూస్తూ ఊరుకొంటోంది.బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో చైనా ఇప్పటికే అనేక ఆనకట్టలు నిర్మించింది. మరి కొన్నింటి నిర్మాణం కొనసాగుతోంది. ఈ ఆనకట్టలు జల విద్యుత్ కేంద్రాలని, వీటివల్ల
బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహ పరిమాణం కాని, వేగం కాని తగ్గవని చైనా కొన్నిసార్లు ప్రకటించింది. భారత ప్రయోజనాలకు భంగం కలుగని రీతిలో మాత్రమే బ్రహ్మపుత్ర జలాలను తాము మళ్లించుకుంటున్నట్టు మరికొన్ని సందర్భాల్లో వెల్లడించింది.టిబెట్‌లోని హిమగిరుల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది.. భారత్, బంగ్లాదేశ్‌ మీదుగా పయనించి బంగాళాఖాతంలో కలుస్తోంది. వర్షాకాలంలో ఆ నదికి భారీగా వరదలొస్తాయి. జలవిద్యుత్ కోసమంటూ డ్యామ్‌లు నిర్మించిన చైనా… భారీగా వరదలొచ్చినప్పుడు ఒక్కసారిగా నీటిని దిగువకు వదిలితే..ఈశాన్య రాష్ట్రాలు ముంపునకు గురవుతాయి

 

మహంకాళీ ఆలయంలో బండి పూజలు

 

Tags:China is ready to build a huge project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *