ఆ ఏడు గ్రామాలకు చైనానే దిక్కు

China is the gateway to the seven villages

China is the gateway to the seven villages

Date:05/10/2018
చైనా ముచ్చట్లు:
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటింది. అభివృద్ధి దిశగా వడి వడిగా అడుగులేస్తున్నాం. ఐటీ, ఫార్మా రంగాల్లో మనదే ఆధిపత్యం. బుల్లెట్ రైలు మార్గాల ఏర్పాటు గురించి కూడా మాట్లాడుకుంటున్నాం.
కానీ ఇదంతా నాణేనికి ఒక వైపే. మరోవైపు చూస్తే.. సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతలా అంటే.. తిండికి, బట్టకు ఆ మాటకొస్తే.. కూరలో వేసుకునే ఉప్పు కోసం కూడా పొరుగు దేశాల మీద ఆధారపడేలా.
నమ్మలేకపోతున్నారా.. కానీ ఇదే నిజం. ఉత్తరాఖండ్‌లో ధార్‌చులా ప్రాంతంలో ఉన్న బ్యాస్ లోయలో ఏడు గ్రామాలున్నాయి. ఇక్కడ 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు ఉప్పు, వంటనూనె, బియ్యం, గోధుమలు లాంటి నిత్యావసరాలను చైనా నుంచి సమకూర్చుకుంటున్నాయి. మధ్యలో ఉన్న నేపాల్ మీదుగా ఆ వస్తువులు ఇక్కడికి చేరుకుంటున్నాయి.
ప్రస్తుతం ఇస్తోన్న రేషన్ సరుకుల కోటాను రాష్ట్ర ప్రభుత్వం పెంచితే ఈ దుస్థితి వారికి తప్పుతుంది. కానీ ఆ దిశగా ముందడుగు పడటం లేదు. ‘స్వదేశంలో మేం అనాథల్లా బతుకుతున్నాం. రెండు దేశాల సరిహద్దులో కీలక ప్రాంతంలో ఉన్నాం.
ప్రభుత్వం మాకు రేషన్ కోటా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అని గార్‌బ్యాంగ్ గ్రామానికి చెందిన క్రిష్ణ గార్‌బ్యాల్ తెలిపాడు. బుండీ, గుంజి, కుటి, నపల్చు, నభి, రాంగ్‌కాంగ్ గ్రామస్థులు కూడా ఇదే కోరుతున్నారు.
కొండ ప్రాంతాలు కావడంతో ఈ లోయకు చేరుకునే రోడ్డు చాలా నెలల క్రితం దెబ్బతింది. అక్కడికి చేరుకునేందుకు రహదారి సౌకర్యం లేకుండా పోవడంతో.. రేషన్ సరుకులు సకాలంలో అక్కడికి చేరుకోలేదు.
‘మాకు దగ్గర్లోని మార్కెట్ ధార్‌చులా, 50 కి.మీ. దూరంలో ఉంటుంది. రోడ్డు బ్లాక్ కావడంతో ప్రభుత్వం అందిస్తోన్న రేషన్ సరుకులు మాకు అందడం లేదు. ఆహారం, ఇతర నిత్యావసరాలు పొందడం కష్టమవుతోంద’ని నభి గ్రామానికి అశోక్ నబియాల్ తెలిపాడు.
ఒకవేళ రేషన్ సరుకులు సకాలంలో చేరినా.. అవి కూడా సరిపోవడం లేదు. ప్రతి కుటుంబానికి 2 కేజీల బియ్యం, 5 కేజీల గోధుమలు మాత్రమే అందుతున్నాయి. అవి మాకు సరిపోవడం లేదు. దీంతో నేపాల్‌లోని టింకర్, చంగ్రూ గ్రామాల నుంచి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నాం. వీటిని అక్కడి ప్రజలు చైనాలోని టక్లాకోట్ బజార్ నుంచి తెప్పిస్తార’ని నబియాల్ తెలిపాడు.
Tags:China is the gateway to the seven villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed