తైవాన్‌ను ఆక్రమించేందుకు చైనా మిలటరీ

Date:20/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

చైనా నుంచి విడిపోయి స్వతంత్రపాలన సాగిస్తున్న తైవాన్‌ను ఆక్రమించేందుకు చైనా మిలటరీ చర్యకు సిద్ధమవుతోందని మిలటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగ్నేయ తీరంలో చైనా భారీగా అత్యాధునిక ఆయుధాలను, సైనిక బలగాలను మోహరిస్తుండటంతో తైవాన్‌పై దాడికే ఈ మోహరింపు అని వివరిస్తున్నారు. ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక కథనం ప్రకారం.. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఉన్న పాత డీఎఫ్‌ 11, డీఎఫ్‌ 15 క్షిపణుల స్థానంలో ఆధునిక ఢీఎఫ్‌ 17 క్షిపణులను చైనా మోహరిస్తోంది. ఈ ఆధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణి అత్యంత కచ్చితంగా శత్రు లక్ష్యాలను చేధిస్తుంది.
స్వీయ పాలనలో ఉన్న ద్వీప దేశం తైవాన్‌ను తన నియంత్రణలోకి తీసుకునేందుకు చైనా చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ చైనాలో అంతర్భాగమని వాదిస్తోంది. తైవాన్‌ను ఆక్రమించేందుకు అవసరమైతే మిలటరీ చర్యకు వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు.

 

 

గ్వాంగ్‌డాంగ్, ఫ్యుజియన్‌ ప్రాంతాల్లో చైనా బలగాల, ఆయుధ వ్యవస్థల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కెనడాకు చెందిన ‘కన్వా డిఫెన్స్‌ రివ్యూ’ పేర్కొంది. చైనా పాలకవర్గం ఆజమాయిషీని తైవాన్ ఎన్నడూ అంగీకరించలేదు. ఈ స్వయంపాలిత దీవి తమ దేశ అంతర్భాగమని చైనా అధికారులు పదే పదే ప్రకటిస్తుంటారు. కాగా అవసరమైతే సైనికబలాన్ని ప్రయోగించైనా సరే తైవాన్‌ను ఆక్రమించుకుంటామని చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ ఇటీవల చాలా తరచుగా ప్రకటిస్తూ వస్తున్నారు.

 

తైవాన్‌ లక్ష్యంగా యుద్ధం చేసేందుకు తూర్పు, దక్షిణ కమాండ్స్‌ల క్షిపణి వ్యవస్థలను చైనా ఇటీవల రెట్టింపు స్థాయిలో బలోపేతం చేసిందని వెల్లడించింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక దళాలకు  చైనా అధ్యక్షుడు పిలుపిచ్చిన విషయం తెలిసిందే.దానికి తోడుగా ఇటీవలి సంవత్సరాల్లో తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను చైనా తీవ్రతరం చేసింది. చైనా భూభాగానికి, తైవాన్‌కి మధ్య ఉన్న మధ్యప్రాంతాన్ని 40 చైనా యుద్ధ విమానాలు ఉల్లంఘించిన విషయం కూడా వార్తల్లోకి వచ్చింది. ఇది బలాన్ని ప్రదర్శించి తమను బెదిరించడమే అవుతుందని తైవాన్ అధ్యక్షురాలు ట్సాయింగ్ వెన్ ప్రకటించారు కూడా.

ఏపీ తెలంగాణ‌లో మాత్రం స‌గానికి స‌గం

Tags: China military to occupy Taiwan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *