చైనా హెచ్‌9ఎన్‌2 వైర‌స్ వాళ్ళ భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేదు

 స్ప‌ష్టం చేసిన  భార‌త ప్ర‌భుత్వం


న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 


చైనాలో ప్ర‌స్తుతం హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కేసులు ప్ర‌బ‌లుతున్న నేపద్యం లో శుక్రవారం  భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది.  చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసుల‌తో భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఏవియ‌న్ ఇన్‌ప్లుయాంజా కేసుల‌తో పాటు, శ్వాస‌కోస వ్యాధుల సంఖ్య చైనాలో పెరుగుతున్నాయి. చిన్నారుల్లోనే ఈ ల‌క్ష‌ణాలు అధికంగా క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త స‌ర్కారు ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది. ఎటువంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.పిల్ల‌ల్లో న‌మోదు అవుతున్న నుమోనియా కేసుల‌కు కొత్త త‌ర‌హా ప్యాథోజ‌న్‌తో లింకు లేద‌ని చైనా వెల్ల‌డించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ఓ మీడియా స‌మావేశంలో పేర్కొన్న‌ది. అక్టోబ‌ర్ నుంచి చైనా పిల్ల‌ల్లో శ్వాస‌కోశ వ్యాధులు న‌మోదు అవుతున్న‌ట్లు డేటా ప్ర‌కారం తెలుస్తోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వ్యాధుల‌కు సంబంధించిన మ‌రింత డేటాను ఇవ్వాల‌ని చైనాను కోరిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. బీజింగ్‌లో కానీ, లియానింగ్‌లో కానీ ఎటువంటి కొత్త ప్యాథోజెన్స్‌ను గుర్తించ లేద‌ని, అయితే పిల్లల్లో నుమోనియా కేసులు పెర‌గ‌డానికి సాధార‌ణ ప్యాథోజెన్లే కార‌ణ‌మ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది.

 

Tags: China’s H9N2 virus poses no risk to India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *