మళ్లీ చైనా సన్నాయి నొక్కులు

Date:15/02/2018
ఇటానగర్ ముచ్చట్లు:
అరుణాచల్ ప్రదేశ్‌ను ఇప్పటికీ తమ దక్షిణ టిబెట్‌లో భాగంగా భావిస్తున్న చైనా.. ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై తాము కచ్చితంగా నిరసన తెలుపుతామని స్పష్టంచేసింది. చైనా అసలు అరుణాచల్ ప్రదేశ్‌ను ఎప్పుడూ గుర్తించలేదు. ఈ వివాదాస్పద ప్రాంతంలో మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాం అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ అన్నారు. భారత్‌తో ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఒప్పందం కుదిరిందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరిస్తామని గెంగ్ అన్నారు. వివాదాస్పద ప్రాంతాల విషయంలో భారత్ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగకూడదని గెంగ్ చెప్పారు. మెక్‌మెహన్ రేఖ అక్రమం అని, ఇండియా, చైనా మధ్య సాంప్రదాయ సరిహద్దు ప్రకారం ఆ ప్రాంతాలన్నీ చైనాకే చెందుతాయని గెంగ్ అన్నారు. అసలు ఆ ప్రాంతాలను ఇండియాకు కట్టబెట్టడానికి ఆ రేఖను బ్రిటన్ 1914లో అక్రమంగా ఏర్పాటు చేసిందని ఆరోపించారు. రెండు దేశాల మధ్య అతి కష్టమ్మీద వృద్ధి చెందుతున్న సంబంధాలను ఇండియా గౌరవించాలని ఆయన కోరారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత నేతల పర్యటనలను చైనా ఎప్పటి నుంచో నిరసిస్తూ వస్తున్నది. ఈ వివాదాస్పద ప్రాంతాలపై ఇప్పటికే రెండు దేశాల మధ్య 20సార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.
Tags: China’s seamless backslash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *