పాము తరహా రోబోను తయారు చేసిన చైనా అంతరిక్ష శాస్త్రవేత్తలు

బీజింగ్‌  ముచ్చట్లు:
 
చైనా అంతరిక్ష శాస్త్రవేత్తలు పాము తరహా రోబోను తయారు చేయనున్నట్టు ప్రకటించారు. రోబో పాము 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 9 భాగాలు ఉంటాయి. అవసరమైనప్పుడు ఈ తొమ్మిది భాగాలు ఒకదాని నుంచి మరొకటి పాములాగా సాగుతాయి. ఇవి దేనికవే శక్తిని ఉత్పత్తి చేస్తాయి.అంతరిక్షంలో ఉపగ్రహాలను రిపేర్‌ చేయడానికి ఈ రోబో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, చైనా తమ ప్రత్యర్థి దేశాలకు చెందిన ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చని అమెరికా లాంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
 
Tags: Chinese astronomers make a snake-like robot