చిన్మయి..సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు ఫిదా

Date:22/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

అప్పనంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీ దొరికిందికదా అని సొల్లు కార్చుకుంటూ కక్కుర్తి పడితే ఇదిగో రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో చిన్మయి హాట్ టాపిక్‌గా మారడంతో పాటు తమిళ ఇండస్ట్రీ నుండి బ్యాన్ కూడా ఎదుర్కొంది. అప్పటి నుండి సోషల్ మీడియాలో తన వాయిస్‌ని వినిపిస్తున్న చిన్మయికి నెట్టింట్లోనూ వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ నెటిజన్ ‘‘నీ నగ్న చిత్రాలు పంపు’’ అంటూ తన కామవాంఛను బయటపెట్టాడు. అయితే ఇలాంటి వెకిలి చేష్టలు వేసేవారికి చెక్ పెట్టడంతో దిట్ట అయిన చిన్మయి అతనికి చెప్పుతో కొట్టునట్టు రిప్లై ఇచ్చింది. ‘ఇవిగో ఇవే నా ఫేవరెట్‌ న్యూడ్స్‌’ ఫొటోలను పంపింది. ఆమె పంపినవి ఆమె న్యూడ్ పిక్స్ కాదు.. న్యూడ్ పిక్స్ అనే బ్రాండ్‌కి సంబంధించిన వివిధ రకాల లిప్ స్టిక్స్ ఫొటోలను ఆ నెటిజన్‌కి పంపించి చెప్పుతో కొట్టినట్టు చేసింది చిన్మయి. ఈ సంభాషణను స్క్రీన్స్ షాట్స్ తీసి.. ‘ఓ నీచుడు వక్రబుద్ధి.. ఎంటర్‌టైన్ మెంట్ కోసం’ అంటూ వాటిని షేర్ చేశారు. ఇక చిన్మయి దిమ్మతిరిగే సమాధానానికి నెటిజన్ల నుండి ప్రశంసలు అందుతున్నాయి. చెప్పుతీసుకుని కొట్టే సమాధానం ఇచ్చారు.. బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. హ్యాట్సాఫ్‌ అంటూ ఈ న్యూడ్ లిప్ స్టిక్స్ ఫొటో ట్వీట్‌ను వైరల్ చేశారు. ఇక చిన్మయి సింగర్‌గానే కాకుండా సమంతకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఫేమస్ అయ్యారు. అలా సమంతతో మంచి అనుబంధం ఉంది. ప్రముఖ నటుడు, యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్యే చిన్మయ. దర్శకుడిగా చి.ల.సౌ చిత్రంతో తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్‌.. ప్రస్తుతం నాగార్జున హీరోగా ‘మన్మథుడు 2’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.

 

జగన్ సైలెన్స్ రీజనేంటీ

 

Tags: Chinmayi sense of humor to fame

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *