ఘనం గా చిన వెంకన్న కల్యాణం

ఏలూరు ముచ్చట్లు :

 

పశ్చిమగోదావరి జిల్లా  ద్వారకా తిరుమల   శ్రీవెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ వారి కళ్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా జరిగింది.స్వామివారి స్వార్జిత కళ్యాణ మండపం లో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పెద్దలు గాను  బంధువులు గాను వైదికులు హాజరయ్యారు.
పురాతన ఆచారాలు ,సనాతన ధర్మాల ప్రకారం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు ధరింపజేసి శాస్త్రోక్తం గా   ఈ ఓ.   జి వి సుబ్బారెడ్డి దంపతుల సమక్షం లో ఆలయ అర్చకులు , పండితులు   మంత్రోచ్ఛారణలు మధ్య   స్వామివారికి అమ్మవారికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
ఈ అద్భుతమైన కళ్యాణ  మహోత్సవాన్ని కోవిడ్ కారణం గా భక్తులు ఆన్ లైన్ లో ను యూ ట్యూబ్ లోను వీక్షిస్తూ స్వామివారికి అమ్మవారికి ఆన్ లైన్ లొనే అక్షింతలు వేసి ఆనంద పరవసులయ్యారని ఈ ఓ సుబ్బారెడ్డి  మీడియాకు తెలిపారు.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Chinna Venkanna Kalyanam as a solid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *