చినరాజప్పకు ఎమ్మెల్సీనేనా….

Chinnarajappa is an MLC

Chinnarajappa is an MLC

 Date:09/10/2018
కాకినాడ  ముచ్చట్లు:
చిన రాజప్పకు ఎమ్మెల్సీ నేనా…అంటే ఔననే సమాధానమే వస్తోంది. పీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కొందరు నేతలకు గట్టి షాకే ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరికి అనూహ్యంగా నియోజకవర్గాలను మార్చేయటం, మరి కొందరికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబులో రెండో ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు షాక్ తగల నుందిని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఫలితంగా గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం నుండి గెలిచిన నిమ్మకాయలకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అసలు టిక్కెట్టిస్తారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట.
గత ఎన్నకల్లో నిమ్మకాయల పెద్దాపురంలో 10 వేల ఓట్ల మెజారిటీతో విజయంసాధించారు. నిజానికి పెద్దాపురం రాజప్ప నియోజకవర్గం కాదు. రెండు దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగానే కొనసాగుతున్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపి సీనియర్ నేత బొడ్డు భాస్కరరావు వైసిపిలోకి వెళ్లిపోవడంతో ఆ నియోజకవర్గంలోకి నిమ్మకాయల వలస వెళ్ళారు. ఈ నేపధ్యంలోనే ఆయన విజయం సాధించారు. అయితే, వైసిపిలోకి వెళ్ళిన బొడ్డు మళ్ళీ టిడిపిలోకి తిరిగి వచ్చేశారు. 2019లో టిక్కెట్టు విషయంలో హామీతోనే బొడ్డు టిడిపిలోకి వచ్చారని సమాచారం. దీంతో రాబోయే ఎన్నికల్లో తనకే టిక్కెట్టంటూ బొడ్డు నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారని సమాచారం.
కమ్మ సామాజికవర్గానికి చెందిన బొడ్డు ఆర్ధికంగా బలవంతుడని పేరుపొందారు. దాంతో నిమ్మకాయల కూడా బొడ్డును ఆపలేక అయోమయంలో పడుతున్నారట. పోనీ వేరే ఏదైనా నియజకవర్గంలో పోటీ చేద్దామా ఎక్కడా నిమ్మకాయలకు అవకాశం దక్కేలా కనిపించడం లేదట. ఎక్కడిక్కడ సిట్టింగులు, లేకపోతే గట్టి నేతలు ఎదురవుతున్నాట. ఒకవేళ పెద్దాపురంలో బొడ్డుకే టిక్కట్టు ఖాయమైతే, నిమ్మకాయల పోటీ చేయటానికి నియోకవర్గమే లేదని సమాచారం. అందుకే చంద్రబాబు కూడా నిమ్మకాయలను వచ్చే ఎన్నికల్లో పక్కనపెట్టేసి జిల్లా మొత్తాన్ని సమన్వయం చేసే బాధ్యతను అప్పగించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ నిమ్మాకయలను ఎంఎల్సీగా పంపితే సరిపోతుందని అనుకుంటన్నారని కూడా తెలుస్తోంది.
Tags:Chinnarajappa is an MLC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *