Natyam ad

చైనా, అమెరికా మధ్య చిప్ వార్

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

చైనాకు జరిగే  చిప్ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియంత్రించేందుకు యూఎస్ తీసుకుంటున్న చర్యలను  చైనీస్ ప్రభుత్వం శనివారం ఖండించింది. ఇంటర్నేషనల్ ఎకనామిక్‌‌‌‌‌‌‌‌, ట్రేడ్ రూల్స్‌‌‌‌‌‌‌‌కు ఇది విరుద్ధమని ఆ దేశ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మావ్‌‌‌‌‌‌‌‌ నింగ్ పేర్కొన్నారు.  అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ కంప్యూటింగ్ చిప్‌‌‌‌‌‌‌‌లను చైనా తయారు చేయకుండా ఉంచేందుకు  యూఎస్ తన చిప్ టెక్నాలజీని చైనాకు ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేయడంలో ఇబ్బందులు పెడుతోంది. అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌, హై పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ కంప్యూటింగ్‌‌‌‌‌‌‌‌ చిప్‌‌‌‌‌‌‌‌లు, సెమికండక్టర్ల మాన్యూఫాక్చరింగ్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్లను చైనాకు ఎగుమతి చేయడంలో యూఎస్ శుక్రవారం నియంత్రణలు పెట్టింది. అంతేకాకుండా ఇప్పటికే సూపర్ కంప్యూటర్లు లేదా సెమికండక్టర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో చైనా వాడుతున్న ఐటెమ్‌‌‌‌‌‌‌‌లకు కొత్తగా లైసెన్స్ తీసుకోవాలని  ఆదేశాలిచ్చింది.  దీనిపై చైనా మండిపడుతోంది.  సైన్స్ అండ్ టెక్నాలజీని యూఎస్ ఆయుధంగా వాడుతోందని, వీటితో రాజకీయం చేస్తోందని  మావ్‌‌‌‌‌‌‌‌ నింగ్ అన్నారు. ఎన్ని చేసినా చైనా అభివృద్ధి అడ్డుకోలేరని హెచ్చరించారు.  యూఎస్ మాత్రం తమ ఫారిన్ పాలసీలో భాగంగా నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి తాజా చర్యలు తీసుకున్నామని చెప్పుకొస్తోంది. టెక్నాలజీ పరమైన అంశాల్లో చైనా, యూఎస్ మధ్య సంబంధాలు  గత కొన్నేళ్ల నుంచి క్షీణిస్తున్నాయి. సెమికండక్టర్ల డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో  యూఎస్‌‌‌‌‌‌‌‌కు పోటీగా చైనా ఎదుగుతోంది. ఇప్పటికే  రూ. వేల కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను చిప్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం  పొందగలిగింది. మరోవైపు  సైన్స్‌‌‌‌‌‌‌‌ అండ్ టెక్నాలజీలో టాప్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్న యూఎస్ తాజా చైనా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను చూసి ఆందోళన పడుతోందని చెప్పొచ్చు. యూఎస్‌‌‌‌‌‌‌‌, చైనా మధ్య  నెలకొన్న గొడవలతో చైనాతో పాటు  యూఎస్ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. యూఎస్ చిప్‌‌‌‌‌‌‌‌ల కంపెనీ ఎన్‌‌‌‌‌‌‌‌విడియా, ఏఎండీ షేర్లు గత ఏడాది కాలంలో 40 శాతానికి పైగా పతనమయ్యాయి.

 

Tags: Chip war between China and America

Post Midle
Post Midle