జనసేనకు సలహాదారుగా చిరంజీవి!

Chiranjeevi is an adviser to Jansea!

Chiranjeevi is an adviser to Jansea!

Date:10/11/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
మెగాస్టార్ చిరంజీవి సైతం తన పొలిటికల్ కెరీర్ లో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారా? తనకు నీడనిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పేయనున్నారా?  సిద్ధాంతాలను తుంగలో తొక్కి మరీ పొత్తు పెట్టుకున్న టీడీపీ- కాంగ్రెస్ ల తీరును నిరసిస్తూ ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారా?  కొద్దికాలంగా పార్టీకి అంటీముట్టనున్న మెగాస్టార్…
త్వరలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేయడమే కాకుండా – సోదరుడి పార్టీ కోసం తెరమీదకు వస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు.రాజకీయంగా బద్దశత్రువు అయిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ కలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా  మారిన సంగతి తెలిసిందే. అనేక మంది కాంగ్రెస్ సీనియర్లు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతూ పదవులు వీడుతున్నారు.
మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్ – బాలరాజు – మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య ఈ జాబితాలో ఉన్నారు. బయటపడని నేతలు మరెందరో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలాగే అసంతృప్తిలో ఉన్న చిరంజీవి టీడీపీ- కాంగ్రెస్ ల అనైతిక పొత్తుతో తీవ్రంగా మథనపడుతున్నట్లు సమాచారం. అందుకే త్వరలో పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చిరంజీవి దీనిపై నిర్ణయం తీసుకోలేదని – అయితే త్వరలో ఓ క్లారిటీకి రావచ్చని అంటున్నారు. దీనిపై ఈ నెలలోనే చిరంజీవి స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం.
సినీ రంగంలో సత్తా చాటుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే కేవలం 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పార్టీ పరిమితం అయ్యింది . ఆ తర్వాత కొంతకాలానికే వివిధ పరిణామాల మధ్యన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం 2012 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ  బాధ్యతలు నిర్వహించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడటంతో…చిరంజీవి మంత్రి పదవి కూడా పోయింది.
రాజ్యసభ సభ్యత్వం ముగిసిన నేపథ్యంలో…చిరు పొలిటికల్ కెరిర్ ఇక ముగిసినట్లేనని కొందరు అంటున్నారు. అయితే తాజా పరిణామాలతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తన సోదరుడు – పవర్ స్టార్ స్థాపించిన జనసేన పార్టీకి చిరు సేవలు అందించనున్నారని – జనసేనకు సలహాదారుగా ఉంటారని కొందరు జోస్యం చెప్తున్నారు.
Tags: Chiranjeevi is an adviser to Jansea!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *