వేణుమాధవ్ మృతికి చిరంజీవి సంతాపం

Chiranjeevi mourns death of Venumadhav

Chiranjeevi mourns death of Venumadhav

Date:25/09/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ బుధవారం హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా  తుదిశ్వాస  విడిచిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపంప్రకటించారు. ఈ సందర్భంగా మెగాస్టార్  చిరంజీవి  వేణుమాధవ్ అకాలమరణంపై   దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

వేణుమాధవ్ తొలిసారి నాతో కలిసి మాస్టర్  సినిమాలో నటించాడు. అటుపై  పలు సినిమాల్లో నటించి హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమేపుట్టాయన్నంతగా నటించేవాడు. ఆ పాత్రకే వన్నే తీసుకొచ్చే వాడు . వయసులో చిన్న వాడు. సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్ ఉందని అనుకునే వాడిన కానీ దేవుడు చిన్న చూపుచూసాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నానన్నారు”” అన్నారు

ఎపి ఉన్నత విద్య నియంత్రణ అండ్ పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య

Tags: Chiranjeevi mourns death of Venumadhav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *