అంబరీష్ మృతదేహం ముందు కన్నీరు పెట్టిన చిరంజీవి,రజినీకాంత్

Anirish's body is the tears of Chiranjeevi and Rajinikanth

Anirish's body is the tears of Chiranjeevi and Rajinikanth

Date:25/11/2018

బెంగళూరు ముచ్చట్లు:

ప్రముఖ కన్నడ నటుడు శాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ మరణం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షాక్ లో ముంచెత్తినాడింది. సినిమా రంగంలోని చాలామంది అంబి అంటూ అత్యంత ప్రేమగా పిలుచుకునే అంబరీష్ ఇక లేరు అనే విషయాన్ని ఇప్పటికి ఇండస్ట్రీ నమ్మలేకపోతోంది. అంబరీష్ మరణ విషయం తెలియగానే సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు సౌత్ సినీ ప్రముఖులు బెంగళూరు చేరుకున్నారు. తమ ఆప్తమిత్రుడు మరణించిన విషయాన్ని
రజినీకాంత్, చిరంజీవి జీర్ణించుకోలేక అంబరీష్ మృతదేహాన్ని చూసి వెంటనే భావోద్వేగాలను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అభిమానుల సందర్శనార్థం అంబరీష్ భౌతిక కాయాన్ని కంఠీరవ స్టేడియం లో ఉంచారు. వేలాదిగా అభిమానులు
అంబరీష్ ను కడసారి చూడడానికి తరలివస్తున్నారు.

ఉత్సాహంగా తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం

Tags:Chiranjeevi, Rajinikanth, who tears before the body of Ambarish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *