మోడీతో స్టేజీ పంచుకోనున్న చిరంజీవి

హైదరాబాద్ ముచ్చట్లు:


మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరంలో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానీ మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడకలలో భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.. అయితే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌` పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసమే చిరంజీవిని ఆహ్వానించడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

 

Tags: Chiranjeevi sharing stage with Modi

Leave A Reply

Your email address will not be published.