మెడికల్‌ ఆఫీసర్‌గా చిర్మిల

Chirmila as Medical Officer of Punganur

Chirmila as Medical Officer of Punganur

Date:13/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రభుత్వ వైద్యశాల మెడికల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ చిర్మిల ను నియమిస్తూ డిసిహెచ్‌ఎస్‌ సరళమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న మెడికల్‌ ఆఫీసర్‌ ఫైరోజ్‌బేగం విధులు సక్రమంగా నిర్వహించడం లేదని గత వారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణం బదిలీ చేయాలని డిసిహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆమెను బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇక్కడ గైనకాలజిస్ట్గా ఉన్న చిర్మిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చిర్మిల మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రతి ఒక్కరికి సక్రమమైన వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండ ప్రభుత్వ వైద్యశాలకు గుర్తింపు తీసుకొచ్చేలా సిబ్బంది అందరు పని చేయాలని కోరారు.

పౌరసత్వ బిల్లును రద్దు చేసేదాక పోరాటం

Tags: Chirmila as Medical Officer of Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *