చిరు కాంగ్రెస్ వాదే

విజయవాడ ముచ్చట్లు :

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్‌లో లేరని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ వ్యాఖ్యానించారంటూ పలు మీడియా చానల్స్‌లో వచ్చిన వార్తలను పీసీసీ ఖండించింది. మెగాస్టార్ చిరంజీవి ముమ్మాటికీ కాంగ్రెస్ వాదేనని ఎఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేసింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరని చెప్పినట్లు ప్రచురితమైన వార్తలపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మంగళవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు.కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేనని శైలజానాథ్ వెల్లడించారు. చిరంజీవి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఊమెన్ చాందీ చెప్పారన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు చిరంజీవి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని చెప్పారు.చిరంజీవి, ఆయన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ వాదులని శైలజానాథ్ అన్నారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు, పార్టీలో లేరని వార్తలు రాయడం దారుణమని మండిపడ్డారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని.. ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని శైలజానాథ్ వెల్లడించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Chiru Congress Wade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *