ఉద్రిక్తతంగా చిత్తూరు కలెక్టరేటు
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు కలెక్టరేట్ ప్రాంగణం ఉపాధ్యాయులు ఉద్యోగులతో జనసంద్రంగా మారింది .ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్పటికీ, హౌస్ అరెస్ట్ చేసిన స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు చిత్తూరు కలెక్టరేట్ ప్రాంగణం చేరుకొని తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి కొంత మందిని పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో ఉంచినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. పిఆర్సి నివేదికను వెంటనే బయటపెట్టాలని అంతేకాకుండా హె చ్ అర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలంటూ, సి పి ఎస్ రద్దు పై మాట మార్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ నిరసన అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఉపాధ్యాయులు నిరసన ముందర పోలీసులు వెనక్కి తగ్గారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Chittoor Collectorate in tension