ABCD అవార్డు సాధించిన చిత్తూరు జిల్లా పోలీసులు

Chittoor district police who have won the ABCD award

Chittoor district police who have won the ABCD award

Date:10/01/2019

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ నేర పరిశోధనలో ప్రతిష్టాత్మకంగా ఇవ్వబడే ABCD అవార్డు చిత్తూరు జిల్లా పోలీసులు సాధించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ నేర పరిశోధన చేసిన కేసులకు గాను ప్రతి నెల ABCD అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా గత సం. డిసెంబరు 8వ తేదీన బంగారుపాళెం వద్ద దొంగతనం కాబడిన 5.75 కేజీల బంగారు ఆభరణాల కేసును అత్యంత తక్కువ వ్యవధిలో చాకచక్యంగా చేధించినందుకు పలమనేర్ సబ్ డివిజన్ కు చెందిన గంగవరం సర్కిల్ పోలీసులకు మూడవ బహుమతి ప్రకటించారు. విజయవాడ డి.జి.పి. కార్యాలయంలో జరిగిన ABCD అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్ర సీఎస్ అనిల్ చంద్ర పునేఠా చేతుల మీదుగా  రాష్ట్ర డి.జి.పి. ఆర్.పి. ఠాకూర్ సమక్షంలో పూర్వపు ఎస్.బి  డి.ఎస్.పి. ఎన్.టి.వి. రాంకుమార్, గంగవరం ఇన్స్పెక్టర్  పి.శ్రీనివాసులు, బంగారుపాలెం ఎస్.ఐ.  వి.రామకృష్ణయ్య, పలమనేర్ అర్బన్ పోలీసు  దేవరాజులు, HC 1044 లకు అందజేశారు. ABCD అవార్డు నందు మూడవ బహుమతి సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి చిత్తూరు ఎస్.పి విక్రాంత్ పాటిల్, అడిషనల్ ఎస్.పి. అడ్మిన్ ఇ.సుప్రజ, అడిషనల్ ఎస్.పి. ఆపరేషన్స్  కృష్ణార్జున రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

చికిత్స అందించడంలో మెడికల్ టెస్ట్ లదే కీలకపాత్ర

Tags:Chittoor district police who have won the ABCD award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *