చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె.బాబు హత్యయత్నం కేసులో చింటుకు జీవితఖైదు

Date:12/03/2018

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె.బాబుపై జరిగిన హత్యాప్రయత్నం కేసులో చింటుకు జీవితఖైదు విధిస్తూ , చిత్తూరు న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. ఈ కేసులో 17 మందిని నిర్ధోషులుగా విడుదల చేశారు. సికె.బాబు కేసులో కఠారి మోహన్‌ను, చింటుతో పాటు మరి కొంత మందిని నిందితులుగా చూపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ , కఠారి మోహన్‌ ను హత్య చేసిన కేసులో చింటు ప్రధాన నిందితుడుగా కడప సెంట్రల్‌జైల్‌లో రిమాండులో ఉన్నారు. తాజా తీర్పు నేపధ్యంలో చింటుకు బయటకు వచ్చే అవకాశాలు ఉండబోవని న్యాయనిపుణులు అంటున్నారు. అత్యంత బందోబస్తు నడుమ తీర్పును న్యాయస్థానం వెలువరించింది.

 

Tags: Chittoor MLA CK Babu is the life imprisonment in the murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *