పార్టీ గ్యాంగ్ కొరకు తీవ్రంగా అన్వేషిస్తున్న చిత్తూరు పోలిస్ యంత్రాంగం

Chittoor Police Agency is looking for a party gang

Chittoor Police Agency is looking for a party gang

Date:13/04/2018

చిత్తూరు ముచ్చట్లు:

North Indian పార్థిగ్యాంగ్ జిల్లాలో సంచరిస్తుందని తెలియగానే జిల్లా Addl Sp శ్రీమతి రాధిక గారు పోలీసులను అప్రమత్తం చేశారు , రాత్రి వేళలో పోలిస్ గస్తీని తీవ్రతరం చేయాలని , అన్ని కాలనీలలో ప్రజలను అప్రమత్తం చేయాలని , పార్థి గ్యాంగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పోలీసులను ఆదేశించారు .క్రమంలో వివిద కాలనీలలో సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించగా , పోలిసులకు రెడ్డి కాలనీలో పార్థి గ్యాంగుకు సంభందించి కదలికలు లభ్యమయనాయిి, దీనిపై మరింత అప్రమత్తమై చిత్తూరు సిసిఎస్ పొలీసులు ఈ గ్యాంగ్ ను పట్టుకొనుటకు తీవ్రమైన గాలింపు మొదలు పెట్టారు .ఇప్ప టివరకు బెంగళూరు, మహారాష్ట్రల్లో దోపిడీలకు పాల్పడ్డ పార్థి గ్యాంగు తాజాగా జిల్లాలో సంచరిస్తుందనటానికి ఆధారాలు లభించాయి.ఈ గ్యాంగ్‌లో 5-6 or 8-10 సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్ ఇళ్లే ఈ గ్యాంగ్ టార్గెట్ అని తెలుస్తుంది.ముఖ్యంగా నిర్మానుషమైన కాలనీలలో కాలనీలోని చిట్టచివరి తాళం వేసిఉన్న లేదా ఇంట్లో జనాలు ఉన్నప్పటికి డబ్బన్న వారి ఇళ్లను గుర్తించి దోపిడీ చేస్తారు.శరీరానికి ఒండ్రు మట్టి గాని లేడా నూనె రాసుకుని సంచరిస్తారు.పగలు కుర్తా మరియు లుంగీ ధరిస్తారు.వీరు రైల్వే స్టేషను లలో , బస్సు స్టాండ్ లలో, చింత చెట్ల క్రింద గుడారలలో లేడా కాలనీలలో ఉన్న కాలీ ప్లాట్ లతో బస చెస్తారు .పగలు బిచ్చగాళ్లలాగా లేడా కూలీలలాగా నటిస్తూ కాలనీలలో సంచరిస్తూ తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిళ్ళు దోపిడి చెస్తారు .

ఒకేరాత్రి 2 – 4 ఇళ్లను దోచుకుంటారు.

ఇంట్లో సభ్యులు ఉండగా కిటికీ రెక్కలు బలవంతంగా తెరిచి, Grill కి చెందిన Screw లను విప్పి వాటిని తొలగించి చాకచక్యంగా లోనికి ప్రవేశించి ఇంట్లో బీరువా తాళం సంపాదించి బీరువా తెరిచి విలువైన వస్తువులను దోచుకుంటారు.ఆ సమయములో మేల్కొంటే వారిపై తీవ్రంగా దాడులు జరిపి వారిని దోచుకుంటారు.ఒకవేళ ఇంటి సబ్యులు వుంటే వాటిని కట్టిపడేస్తారు, ఎదురుతిరిగితే చంపడానికి కూడ వెనుకాడరు.వీరు సహజంగా కత్తులు, రాడ్లు, బ్లేడ్లు మరియు తుపాకులు కలిగి ఉంటారు.వీరు కొన్ని సార్లు దోపిడీచేసిన ఇంట్లో భొజనం చేసి అక్కడే మల విసర్జన చేసి వెళ్తారు.వీరు కొన్నిసార్లు గుడులలో కూడా దోపిడి చేశారు.వీరు ఫాసే పార్థి అనే తెగకు చెందినవారు, ఈ తెగలు మహారాష్ట్రలో మరియు మద్యప్రదేశ్ లో కనబడుతాయి.ఈ తెగకు చెందిన వారు 1999వ సంవత్సరం నుండి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ మరియు ఆంద్ర ప్రదెశ్లలో దోపిడీలు చెసారు .వీరు ఇంతవరకు చాలా తక్కువగా పట్టుబడ్డారు, చివరిసారి ముంబయి పోలీసు 8 Feb 2016 ముంబై లోని బోరవెల్లి లో వీరి పై కాల్పులు జరిపి అరెస్ట్ చెసారు .ఈ విషయంగా చిత్తూరు పోలీసులు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని 20 మందికిపైగా Spl party పోలీసులతో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

Tags: Chittoor Police Agency is looking for a party gang

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *