సైబర్ క్రైమ్స్ పై చిత్తూరు పోలీసుల యుద్ధం

Chittoor Police Battle on Cyber Crimes

Chittoor Police Battle on Cyber Crimes

Date:20/07/2018

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరుజిల్లా ఎస్.పి. శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్.మారుతున్న జీవిత శైలితో పాటు నేరాల స్వరూపం కూడా మారుచున్నది. నేటి జీవన చిత్రం లో ఆన్లైన్ మోసాలు సర్వసాధారణం అయ్యిపొయినాయి. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మోసాలకు గురవుతునే ఉన్నారు. రకరకాల మార్గాలలో మోసగాళ్ళు, నేరగాళ్లు అమాయక ప్రజల కస్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. ఈ రకాల మోసాలను అరికట్టుటకు సమాజంలోని అన్ని తరగతుల వాళ్ళని చైతన్య పరుచుటకు చిత్తూరు పోలీస్ డిపార్టుమెంటు త్వరలో సైబర్ క్రైమ్స్ మీద ఒక భారీ సెమినార్ ను ప్రారంబించబోతున్నది. భారతదేశ ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ ను అరికట్టుటకు ISEA (Information Security Education and Awareness), ప్రాజెక్ట్ ను లాంచ్ చేసి ఉన్నది. ఈ ప్రాజెక్ట్ లో బాగంగా ఎస్.పి. గారు చిత్తూరు జిల్లా నందు బ్యాంకర్స్, ప్రజలను, టీచర్స్ మరియు పోలీసులకు సైబర్ క్రైమ్స్ మరియు సెక్యూరిటీ మీద అవగాహన కలిగించుటకు CDAC, Hyderabad (Centre for Development of Advanced Computing) వారితో అతి త్వరలో ఒక భారీ సదస్సు నిర్వహించుబోచున్నారు. ఈ విషయం పై ఈరోజు చిత్తూరు ఎస్.పి.క్యాంపు ఆఫీస్ నందు జిల్లాలోని బ్యాంక్స్ ల లీడ్ మేనేజర్ శ్రీ గణపతి, ఎస్.బి.ఐ. బ్యాంకు చీఫ్ మేనేజర్ లక్ష్మణ్ రావు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ శ్రీ విష్ణు చరణ్, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ శ్రీ ఎ.ఎస్.రావు మరియు బ్యాంకు అధికారులతో ఎస్.పి.గారు మరియు సి.సి.ఎస్., డి.ఎస్.పి., శ్రీ ఐ.రామకృష్ణ గారు సమావేశమై చర్చిండం జరిగినది. ఈ సందర్బముగా లీడ్ మేనేజర్ గారు ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారం ఉంటుందని చిత్తూరు ఎస్.పి. గారి ఆద్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న సైబర్ సెక్యూరిటీ సదస్సుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. త్వరలో ప్రారంబం కాన్నున సదస్సులో ప్రతి హై స్కూల్/కాలేజీ నుండి ఒక టీచర్/లెక్చరర్, ప్రతి బ్యాంకు నుంచి ఒక బ్యాంకు అధికారి, ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్.ఐ. మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క సబ్యులతో ఒకరోజు ట్రైనింగ్ కార్యక్రమము నిర్వర్తించి ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ వీక్ జరిపి సమాజంలోని అన్ని తరగతుల ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని చిత్తూరు ఎస్.పి. గారు ఒక ప్రకటనలో తెలిపారు.

సైబర్ క్రైమ్స్ పై చిత్తూరు పోలీసుల యుద్ధం https://www.telugumuchatlu.com/chittoor-police-battle-on-cyber-crimes/

Tags:Chittoor Police Battle on Cyber Crimes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *