భారీగా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న చిత్తూరు పోలీసులు.

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా పరిధిలో దశలవారీగా మూడు కోట్ల 60 లక్షల రూపాయల విలువైన 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుఆదివారం ఉదయం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేసారు.ఆయన మాట్లాడుతూ చాట్ బాట్ అప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు 45 లక్షల విలువైన 200 మొబైల్ ఫోన్ లను గుర్తించాము అన్నారు. ఇలా 3 దశల్లో 1700 ఫోన్లు రికవరీ చేసాము అన్నారు. కర్ణాటక, తమిళనాడు,కేరళ,మహారాష్ట్ర ల నుంచి ఫోన్లు రికవరి చేసి భాధితులకు అప్పజెప్పాము అన్నారు. బయటి ప్రాంతాల్లో ఉన్న వారికి కొరియర్ ద్వారా పంపడం జరిగింది అన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ముందుగా 9440900004 నెంబర్ కు హాయ్(HI )అని లేదా HELP మెసేజ్ ఇవ్వాలన్నారు. ఆతరువాత పోలీస్ శాఖ నుంచి వచ్చే లింక్ లో పూర్తి చిరునామా తో పాటూ IMEI నెంబర్ నమోదుచేయాలాన్నారు. అనంతరం పలువురు సిబ్బందిని అభినందించారు.

 

Tags:Chittoor police seized a large number of cell phones.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *