చౌడేపల్లి పి.హెచ్.సి ఆకస్మిక తనిఖీ

Chowdapalli PHC Avalanche Check
Date:19/11/2019
చౌడేపల్లి ముచ్చట్లు:
స్థానిక పి.హెచ్.సిను మదనపల్లి డిప్యూటీ డి.ఎం.హెచ్ ఓ. డాక్టర్ లోకవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈసందర్భంగా ఆయన పి.హెచ్.సి.రికార్డ్స్ ను తనిఖీ చేశారు. ఆర్.సి.హెచ్.వెబ్ పోర్టల్ లో 100 శాతం మాతాశిశు సేవలను తప్పనిసరి గా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రతి పి హెచ్.సి లో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు పట్ల ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాకు, డివిజన్ కార్యాలయమునకు ప్రతీ రోజు పంపాల్సిన నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం కాన్పుల గదిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులకు కాన్పు పైకం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, సి.హెచ్. ఓ.కల్యాణి, ఎం.పి.హెచ్.ఈ.ఓ.అభిమన్యుడు తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేద్దాం
Tags:Chowdapalli PHC Avalanche Check