అంగరంగవైభవంగా చద ళ్ళ గ్రామంలో చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:


చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా NVR ట్రస్ట్ వ్యవస్థాపకులు అయిన   యన్. వేణు గోపాల్ రెడ్డి  చద ళ్ళ గ్రామం లో నిర్మించిన ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు హోమాలు నిర్వహించడం జరిగింది. అమ్మవారికి అభిషేకం, మూల మంత్ర హోమం, దుర్గా హోమం, మహా పూర్ణాహుతి, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. వేణు గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మ వారి జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అందరకి అమ్మ వారి కరుణా కటాక్షాలు కలిగి ప్రజలు అందరకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,కలగాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్య క్రమం లో NVR ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివ కుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, జయపాల రెడ్డి, వెంకట రమణ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, శంకర రెడ్డి, భాస్కర రెడ్డి, మహేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నాగ రాజ రెడ్డి, సందీప్ రెడ్డి, వెంకట రెడ్డి, కిషోర్ రెడ్డి, పురు షోతం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: Chowdeshwari Devi Jayanti celebrations in Chhadla village with splendor

Leave A Reply

Your email address will not be published.