తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచినశ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి, చుక్కాని ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆగమోక్తంగా సంకల్ప పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున రాత్రి చుక్కాని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయంలోని పెద్దనంది విగ్రహం వద్ద సంకల్ప పూజలు చేశారు. అనంతరం తాటిచెట్టును నిలబెట్టి పూజలు చేశారు. అమ్మవారి ఆలయం నుంచి బాల దీపాలను ఊరేగింపుగా తీసుకువచ్చి చుక్కాని వెలిగించారు. విశేష వేడు కను వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివ చ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు. ఈఓ. కేఎస్ రామారావు బియ్యపు పవిత్రారెడ్డి మరియు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఆలయ దీక్షా గురుకుల్ రాజేష్ నేతృత్వంలో ఈ పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని చొక్కాని ఉత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు అయ్యారు.
Tags:Chukkani Utsav on the occasion of full moon in Srikalahasti.