చర్చి ఫాదర్..హత్యా.. ఆత్మహత్యా

విజయవాడ ముచ్చట్లు:

 

ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలు..? విజయవాడ బేసిలికా చర్చి అటెండర్‌ ప్రసాదరావుది ఆత్మహత్య కాదు..హత్య అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు. ఇంతకీ అసలేం జరిగింది..?బిషప్‌ల విషయంలో బేసిలికా చర్చిలో ఎన్నో ఏళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. సీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఉన్న భూముల లీజ్‌ విషయంలోనూ రగడ జరుగుతోంది. చర్చి స్థలంలో బార్‌ పెట్టడాన్ని వ్యతిరేకించారు ప్రసాదరావు. 35ఏళ్లుగా తనకు జీతమివ్వకుండా వేధిస్తున్నారని ప్రసాదరావు గతంతోనే పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు. అప్పటికే ఆవేదనలో ఉన్న తన భార్య, కుమార్తె మరణించారని ఫిర్యాదులో తెలిపారాయన. అందుకే కక్ష గట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు ప్రసాదరావు కుటుంబసభ్యులు. విజయవాడ బేసిలికా చర్చి అటెండర్‌ ప్రసాదరావు మృతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. ప్రసాదరావుది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపిస్తున్నారు ఆయన కుటుంబసభ్యులు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మా నాన్న చర్చిలో చనిపోయారని మాకు చెప్పారు. కానీ మేము వెళ్లేసరికే బాడీని స్పాట్‌ నుంచి ఎందుకు తరలించారని ప్రశ్నిస్తున్నారు ప్రసాదరావు కుటుంబసభ్యులు..మణికట్టు నరాలు కోసినట్టున్నాయని..ఉరేసుకుంటే అలా కోసుకోగలరా అని నిలదీస్తున్నారు. మోడరేటర్‌ గోవాడ దైవాసీర్వాదంపై తమకు అనుమానాలున్నాయంటున్న ఆయన కూతురు, అల్లుడు..ప్రసాదరావు మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అసలేం జరిగింది..?

 

 

ప్రసాదరావుది హత్యా..? ఆత్మహత్యా..? ఆయన కుటుంబసభ్యలేమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి రామ్‌ అందిస్తారు.35ఏళ్లుగా శాలరీ ఇవ్వకుండా వేధించారని ఆరోపిస్తున్నారు ప్రసాదరావు కుమార్తె. సీఎస్ఐ నుంచి చాలా సొమ్ము రావాలని కంప్లైంట్‌ ఇచ్చారని..అందుకే కక్ష గట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు. ప్రసాదరావును తీవ్రంగా కొట్టి ఉరివేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోవాడ దైవాసీర్వాదంపై కంప్లైంట్‌ ఇస్తామని అంటున్నారు.ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు ప్రసాదరావు సన్నిహితులు. నిజానిజాల నిగ్గు తేల్చకపోతే ఆందోళన చేస్తామంటున్నాయి దళితసంఘాలు. సీఎస్ఐ నుంచి చాలా సొమ్ము రావాలని ఇప్పటికే కంప్లైంట్ చేశారు ప్రసాదరావు. ఆయన కంప్లైంట్‌పై యాక్షన్‌ తీసుకున్నామని..ప్రసాదరావునూ సీఎస్ఐ ప్రతినిధుల్ని పిలిచినా విచారణకు హాజరు కాలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు..హత్యా..? ఆత్మహత్యా అన్న కోణంలో విచారిస్తున్నారు.

 

Post Midle

Tags: Church Father..homicide..suicide

Post Midle
Natyam ad