పుంగనూరులో నాటుసారా వ్యాపారిపై పీడియాక్ట్ -సీఐ గంగిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

నాటుసారా వ్యాపారం చేస్తున్న బుడ్డన్ననాయక్‌ అనే వ్యక్తిపై పీడియాక్ట్ నమోదు చేసినట్లు అర్భన్‌ సీఐ గంగిరెడ్డి సోమవారం తెలిపారు. మండలంలోని నల్లగుట్లపల్లెతాండాకు చెందిన బుడ్డన్ననాయక్‌ పలు సారా కేసుల్లో నిందితుడని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుడ్డన్ననాయక్‌పై పీడియాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు. కాగా నాటుసారా , కర్నాటక మధ్యం తీసుకొచ్చి వ్యాపారాలు సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యాపారాలు కొనసాగిస్తే పీడియాక్ట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

 

Tags: CI Gangireddy on Natusara trader in Punganur

 

Leave A Reply

Your email address will not be published.