తిరుమలలో సినీ ప్రముఖులు
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున,ఆయన సతీమణి అక్కినేని అమల స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీనటుడు అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామి వారిని దర్శించుకో లేక పోయాంమని, ఇవాళ స్వామి వారి ఆశీస్సులు పొందాంమని, అలాగే ఈ ఏడాది ప్రపంచ ప్రజలందరికి అందరికి మంచి జరగాలని ప్రార్ధించినట్లు అక్కినేని నాగార్జున చెప్పారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Cine celebrities in Thirumala