చెన్నైలో గుట్టురట్టైన సినీ సెక్స్ రాకెట్

Cine sex rocket in Chennai

Cine sex rocket in Chennai

Date:14/07/2018
చెన్నై ముచ్చట్లు:
చెన్నైలో భారీ సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియా ద్వారా డేటింగ్ సర్వీస్ పేరుతో కుర్రాళ్లకు వల వేస్తున్న ఇద్దర్ని కేటుగాళ్ల ఆటకట్టించారు పోలీసులు. ఓ తమిళ నటి చేసిన ఫిర్యాదుతో ఈ గుట్టు మొత్తం బయటపడింది. చాలా రోజులుగా వీరిద్దరూ తమిళ సినిమా సెలబ్రిటీల ఫోటోలతో ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తేలింది. వీరిద్దర్ని ప్రశ్నించిన పోలీసులకు దర్యాప్తులో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. కొద్ది రోజుల క్రితం తమిళ నటి జయలక్ష్మి ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. మీరు డేటింగ్ చేయాలనుకుంటున్నారా.. మీతో గడిపేందుకు సెలబ్రిటీలు సిద్ధంగా ఉన్నారనేది సారాంశం. షాకైన ఆమె తన ఫ్రెండ్స్‌ కొంతమందికి ఈ మెసేజ్‌ను పంపించారు. వారు దీని గురించి ఎంక్వైరీ చేయగా.. వాళ్లు సినిమావాళ్ల ఫోటోలు పంపి రేటు కూడా ఫిక్స్ చేసేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న జయలక్ష్మి వెంటనే చెన్నై పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ వెంటనే ఈ విషయాన్ని యాంటీ వైస్ స్క్వాడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన టీమ్.. ఈ ఫోటోల వెనుక ఉన్న స్టోరీ మొత్తాన్ని బయటకు లాగారు. ఈ రాకెట్ వెనుక మురుగ పెరుమాన్, కవియరసన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తేలింది. వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు విరుగంబాకంలో అరెస్ట్ చేశారు. ఈ బ్యాచ్‌ను ప్రశ్నిస్తే మొత్తం గుట్టంతా విప్పారు. వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా రిలేషన్‌షిప్ సర్వీస్ పేరుతో దుకాణం పెట్టేశారు. వాట్సాప్‌తో పాటూ ఫేస్‌బుక్‌లో ఏకంగా పేజీలు క్రియేట్ చేసి మరీ కుర్రాళ్లకు వల వేస్తున్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి మొబైల్స్‌ను తీసుకొని చూసి షాకయ్యారు. అందులో తమిళ సినిమా సెలబ్రిటీల ఫోటోలతో పాటూ రేట్ల వివరాలు కూడా ఉన్నాయి. వేల నుంచి లక్షల వరకు ధర నిర్ణయించేశారు. దాదాపు 50మందికిపైగా ఇలా ఫోటోలు, మేసేజ్‌లు పంపినట్లు తేలింది. ఏకంగా సినిమా సెలబ్రిటీల ఫోటోలతో దుకాణం పెట్టేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వీరిద్దరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
చెన్నైలో గుట్టురట్టైన సినీ సెక్స్ రాకెట్https://www.telugumuchatlu.com/cine-sex-rocket-in-chennai/
Tags: Cine sex rocket in Chennai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *