చిప్పకూడు తిన్న సీఐ మాధవ్

Cippauku ciya madhav

Cippauku ciya madhav

Date:21/09/2018
అనంతపురం ముచ్చట్లు:
పోలీసు అధికారుల సంఘం త‌రపున క‌దిరి సీఐ గోరంట్ల మాధ‌వ్ చేసిన  వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌ను  ఎమ్పీ జేసీ దివాక‌ర్ రెడ్డి  సీరియ‌స్   తీసుకున్నారు. అనంత‌పురంలోని త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన  మీడియా స‌మావేశంలో జేసీ ఘాటుగా స్పందించారు.
తాను మ‌ట్లాడిన‌దాంట్లో త‌ప్పేమి లేద‌ని జేసీ స‌మ‌ర్ధించుకున్నారు.త‌ప్పు ఉంద‌ని నిరూపిస్తే ఎక్క‌డైన క్ష‌మాప‌ణ చెబుతాన‌ని స‌వాల్ విసిరారు.తాను ఈ  నెల 25వ తేది వ‌ర‌కు అందుబాటులో ఉంటా.క‌త్తి ప‌దును పెట్టుకో..ప్లేస్ , టైం నిర్ణయించుకో అని సీఐకు ఎమ్పీ స‌వాల్ విసిరారు. నన్ను బెదిరించేంత‌డి మ‌గాడివా అంటూ ఊగిపోయారు. పోలీసులపై నేను ప్రయోగించిన భాష కొజ్జా అన్నది పార్లమెంటరీ నాన్ పార్లమెంటరీ నా అన్నది మీడియా వాళ్లే తేల్చండి.
కొజ్జా అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను పోలీసుల దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పడానికి సిద్ధమేనని జేసీ డ్డి అన్నారు.  ఆశ్రమం వద్ద పోలీసులు కళ్లెదుటే హత్య చేస్తున్న ఏమీ చేయలేని కొజ్జాల్లా ఉండిపోయారు. నేను కూడా కొజ్జాల పరిగెత్తి పోయానని చెప్పుకోచ్చారు. అన్ని మత గ్రంధాలను వాడు ప్రబోధానంద కించపరుస్తూ మాట్లాడుతున్నాడు వీడు ఏమి స్వామి అర్థం కాలేదని అన్ఆరు. ఆశ్రమం తోపాటు అందులోని ఎలాంటి ఏర్పాట్లకు పర్మిషన్లు లేవు.
లోపల ఏర్పాటు చేసుకున్న ప్రింటింగ్ ప్రెస్ దొంగ నోట్లను ముద్రించడం అన్న అనుమానం వ్యక్తం చేసారు. నాలుక కోస్తాం అన్న సిఐ మాధవ్ పై జేసీ తీవ్రంగా ప్రతిస్పందించారు. సీఐ మాధవ్ నాలుక కోస్తావా ఎక్కడికి వస్తావ్. రా.. ఇదేమన్నా సినిమా అనుకున్నావా సిఐ మాధవ్ అని వ్యాఖ్యానించారు. సిఐ మాధవ్ చిప్పకూడు తిన్నాడు.  మాధవ్ నువ్వు నా చుట్టూ ఎన్ని సార్లు తిరిగావు గుర్తు తెచ్చుకో అని అన్నారు. ఎక్కడికి వస్తావు రా ఈనెల 25 వరకు అనంతపురం లోనే ఉంటా మాధవ్ కు జెసి సవాల్ విసిరారు. నాలుక కోస్తాం అన్న గోరంట్ల మాధవ్ పై ఫిర్యాదు చేస్తానని జేసీ అన్నారు.
Tags:Cippauku ciya madhav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *