బీచ్ ని శుభ్రం చేసిన సిఐఎస్ ఎఫ్ జవాన్లు

CISF jawans cleaning the beach

CISF jawans cleaning the beach

Date:07/12/2019

విశాఖపట్నం ముచ్చట్లు:

సాగర తీరాలన్నింటిని స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని విశాఖ సిఐఎస్ ఎఫ్ కమాండెంట్ విజయ్ కుమార్ అన్నారు. విశాఖ సాగర తీరంలో సిఐఎస్ ఎఫ్ జవాన్లు, సిబ్బంది ఆధ్వర్యంలో బీచ్ ని శుభ్రం చేసే కార్యక్రమం జరిగింది. స్వచ్ఛపక్వడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటల పాటు రెండున్నర కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెత్తను ఏరివేశారు. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ బీచ్ లో ఎక్కువగా పడి ఉండడం ఆందోళన కలిగించే అంశంగా సిఐఎస్ ఎఫ్ కమాండెంట్ అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిరోధించగలిగితే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామన్నారు.

 

ఉల్లిపై లొల్లి

 

Tags:CISF jawans cleaning the beach

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *